మరోసారి కూటమి మోసం చేసే ప్రయత్నం చేస్తోందని మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. సూపర్-6, సూపర్-10 పేరుతో మరోసారి మోసానికి తెరలేపారన్నారు. శనివారం ఆయన తాడేపల్లిలోని వైయస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మాట్లాడుతూ, 2014లో చంద్రబాబు మాయమాటలు చెప్పారు.. ప్రజల్ని నమ్మించి టీడీపీ అధికారంలోకి వచ్చింది. 2019లో ఇచ్చిన హామీలను సీఎం వైయస్ జగన్ అమలు చేశారు. మరోసారి ఇచ్చిన హామీలను పక్కాగా అమలు చేస్తామన్నారు.