ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రమాదాన్ని తప్పించిన స్పెషల్ పార్టీ పోలీసులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Oct 29, 2022, 03:48 PM

రాజంపేట వయా. సానిపాయ నుండి రాయచోటికి వెళ్ళు మార్గంలో గొల్లపల్లి దగ్గర పెను ప్రమాదాన్ని తప్పించిన స్పెషల్ పార్టీ పోలీసులు వివరాల్లోకి వెళితే. అన్నమయ్య జిల్లా స్పెషల్ పార్టీ పోలీసులు, ఆర్ఎస్ఐ యస్, జాఫర్ ఆధ్వర్యంలో శుక్రవారం పోలీసు వాహనంలో జిల్లా పోలీస్ కార్యాలయానికి వస్తున్న సమయంలో నడి రోడ్డుపై పోలీసు వాహనం ఎదురుగా 30 మీటర్ల దూరంలో పెద్ద శబ్దం వచ్చి 33 కెవి విద్యుత్తు లైను తెగి రోడ్డు మీద పడింది. అది గమనించి స్పెషల్ పార్టీ పోలీసులు వాహనాన్ని ఆపివేసి క్షుణ్ణంగా పరిశీలించారు. ఆ సమయంలో తెగిపడ్డ విదితులైన్లకు కరెంటు సరఫరా ఉంది, అప్రమత్తమైన పోలీసులు రోడ్డుకి ఇరువైపులా వచ్చే వాహనాలు ఆపివేసి ఆ దారిలో వస్తున్న ప్రజలందరికీ విషయం చెబుతూ. లైన్మెన్ వచ్చి రిపేరు చేసేంతవరకు ఎవరు ఆ దారిన వెళ్లకుండా అక్కడే ఉన్నారు. ఆ సమయంలో ఒక ఆర్టీసీ బస్సు కూడా వచ్చింది బస్సులో దాదాపు 40 మంది ప్రయాణికులు ఉన్నారు. వారిని కూడా ముందుకు వెళ్లకుండా ఎటువంటి ప్రమాదం జరగకుండా కాపాడగలిగారు, స్పెషల్ పార్టీ పోలీసులకు, అభినందనలు, కృతజ్ఞతలు చెప్పిన స్థానికులు, ప్రజలు. విషయం తెలుసుకున్న పోలీసు అధికారులు స్పెషల్ పార్టీ పోలీసుల సేవలను అభినందనమని కొనియాడారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com