ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దాతలసహకారంతో దుప్పట్లు పంపిణీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Oct 29, 2022, 03:49 PM

కమలాపురం నగరానికి చెందిన హోంగార్డ్ సునీల్ ఆర్థిక సహకారాలతో అభి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలు అభినందనీయమని జైలు శాఖ సూపర్డెంట్ గంగాధర్ అన్నారు. శనివారం కమలాపురం నగర పంచాయతీలోని పరిధిలోని పలు వీధుల్లో రోడ్లపైన దర్గా ఆవరణలో, రైల్వే స్టేషన్ ప్రధాన కూడలి వద్ద యాచకులకు, నిరాశ్రయులకు అభిచారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఎన్. విజయబాబు, టీమ్ సభ్యులు పాల్గొని దుప్పట్లు పంపిణీ చేశారు.

ట్రస్ట్ చైర్మన్ మాట్లాడుతూ రాత్రి నగర వీధుల్లో రోడ్డు పక్కన పెట్రోల్ బంకుల వద్ద రైల్వేస్టేషన్లో తీవ్రచలిలో ఇబ్బందులు పడుతు 80 మందిని గమనించి వారికి దుప్పట్లు ఇచ్చి మానవత్వాన్ని చాటుకున్నారు. అలాగే దుప్పట్లు ఇచ్చిన హోంగార్డు సునీల్ కు ట్రస్ట్ తరఫున ధన్యవాదాలు తెలిపారు. అభి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేస్తూ సమాజానికి తమకు తోచిన సహాయం చేస్తామని టీమ్ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సునీల్, శ్యామ్ విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com