జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తీగుల్ ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి అనసూయ గారు తెలిపిన వివరాల ప్రకారం సెయింట్ ఆర్నాల్డ్ హై స్కూల్ తూప్రాన్ లో జరిగినటువంటి సబ్ జూనియర్ కోకో ఎంపిక ప్రక్రియలో పాల్గొని ఉత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి పోటీలకు పాఠశాలో 9వ తరగతి చదువుతున్న వంకా ప్రణతి, బీడ మౌనిక, కడారి వైష్ణవి మరియు ఎర్రబోయిన చందు ఎంపికయ్యారు.
వీరు 13 14 15 తేదీలలో ఖమ్మం జిల్లా కల్లూరు లో జరిగే రాష్ట్రస్థాయి సబ్ జూనియర్ కోకో పోటీలలో పాల్గొంటారు. క్రీడాకారులను మరియు ఫిజికల్ డైరెక్టర్ రాజి రెడ్డి గారిని ప్రధానోపాధ్యాయురాలు మరియు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు మరియు అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ గార్లు అభినందించారు..