వేమనపల్లి మండలం నీల్వాయి గ్రామంలో 10 మంది లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను మాజీ జడ్పీటీసీ ఆర్ సంతోష్ కుమార్, కాంగ్రెస్ మండలాధ్యక్షుడు సాబీర్ పంపిణీ చేశారు. ప్రభుత్వం ఆపదలో ఉన్న వారికి సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేసి ఆదుకుంటుందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ గాలి మధు, కో ఆప్షన్ మాజీ సభ్యుడు పూర్ణచందర్ రెడ్డి, ఒడిల రాజన్న, మాజీ ఉప సర్పంచ్ తిరుపతిరెడ్డి, పురుషోత్తం పాల్గొన్నారు.