ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రైల్వే శాఖ ప్రయాణికులకు షాకింగ్‌ న్యూస్‌

national |  Suryaa Desk  | Published : Wed, Oct 02, 2024, 07:41 AM

దేశంలో పండుగ సీజన్‌ సమీపిస్తున్న వేళ రైల్వే శాఖ ప్రయాణికులకు షాకింగ్‌ న్యూస్‌ చెప్పింది. ఈ సీజన్‌లో వివిధ రైలు సర్వీసులను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.కొన్ని రైల్వే డివిజన్ల పరిధిలో కొత్త ప్రాజెక్టులను చేపట్టినందున ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వేలో పరిధిలోని బిలాస్‌పూర్ కట్ని మార్గంలో కొత్త రైలు మార్గాన్ని జోడించే ప్రక్రియ చేపట్టినందున రైలు సర్వీసులను రద్దు చేస్తున్నట్లు తెలిపింది. ఈ రైల్వే లైన్‌ పనులు అక్టోబర్ 1 నుండి అక్టోబర్ 11 వరకు జరుగుతాయని, ప్రయాణికులు గమనించాలని విజ్ఞప్తి చేసింది. ఈ మార్గంలో దాదాపు 20 సర్వీసులు రద్దవుతున్నాయి. ఆ వివరాలు చూద్దాం.


రద్దయ్యే రైళ్ల లిస్ట్ ఇదే...


18234 బిలాస్‌పూర్-ఇండోర్ నర్మదా ఎక్స్‌ప్రెస్ - బిలాస్‌పూర్‌ నుంచి బయలుదేరే ఈ రైలు సర్వీసులు సెప్టెంబర్ 30 నుండి అక్టోబర్ 10 మధ్య రద్దవుతాయి.


18233 ఇండోర్-బిలాస్‌పూర్ నర్మదా ఎక్స్‌ప్రెస్ - ఇండోర్ నుండి బయలుదేరే ఈ రైలు సర్వీసులు అక్టోబర్ 1 నుండి అక్టోబర్ 11 మధ్య రద్దవుతాయి.


18236 బిలాస్‌పూర్-భోపాల్ ఎక్స్‌ప్రెస్ రైలు సర్వీసులు సెప్టెంబరు 30 నుండి అక్టోబర్ 9 వరకు రద్దవుతాయి.


18235 భోపాల్-బిలాస్‌పూర్ ఎక్స్‌ప్రెస్ రైలు సర్వీసులు అక్టోబర్ 2 నుండి అక్టోబర్ 11 వరకు రద్దవుతాయి.


11265 జబల్పూర్-అంబికాపూర్ ఎక్స్‌ప్రెస్ రైలు సర్వీసులు అక్టోబర్ 2 నుండి అక్టోబర్ 10 వరకు రద్దవుతాయి.


11266 అంబికాపూర్-జబల్పూర్ ఎక్స్‌ప్రెస్ రైలు సర్వీసులు అక్టోబర్ 3 నుండి అక్టోబర్ 11 వరకు రద్దవుతాయి.


18247 బిలాస్‌పూర్-రేవా ఎక్స్‌ప్రెస్ రైలు సర్వీసులు అక్టోబర్ 1 నుండి అక్టోబర్ 9 వరకు రద్దవుతాయి.


18248 రేవా-బిలాస్‌పూర్ ఎక్స్‌ప్రెస్ రైలు సర్వీసులు అక్టోబర్ 2 నుండి అక్టోబర్ 10 వరకు రద్దవుతాయి.


11751 రేవా-చిర్మిరి ప్యాసింజర్ ప్రత్యేక రైలు సర్వీసులు అక్టోబర్‌ 4, 7, 9 తేదీల్లో రద్దవుతాయి.


11752 చిర్మిరి-రేవా ప్యాసింజర్ స్పెషల్ రైలు సర్వీసులు అక్టోబర్‌ 5, 8, 10 తేదీల్లో రద్దవుతాయి.


12535 లక్నో-రాయ్‌పూర్ గరీబ్ రథ్ ఎక్స్‌ప్రెస్ రైలు సర్వీసులు అక్టోబర్‌ 3, 7, 10 తేదీల్లో రద్దవుతాయి.


12536 రాయ్‌పూర్-లక్నో గరీబ్ రథ్ ఎక్స్‌ప్రెస్ రైలు సర్వీసులు అక్టోబర్‌ 4, 8, 11 తేదీల్లో రద్దవుతాయి.


22867 దుర్గ్-నిజాముద్దీన్ ఎక్స్‌ప్రెస్ రైలు సర్వీసులు అక్టోబర్ 4, 8 తేదీల్లో రద్దవుతాయి.22868 నిజాముద్దీన్-దుర్గ్ ఎక్స్‌ప్రెస్ రైలు సర్వీసులు అక్టోబర్ 5, 9 తేదీల్లో రద్దవుతాయి.


18203 దుర్గ్-కాన్పూర్ ఎక్స్‌ప్రెస్ రైలు సర్వీసులు అక్టోబర్‌ 6, 8 తేదీల్లో రద్దవుతాయి.


18204 కాన్పూర్-దుర్గ్ ఎక్స్‌ప్రెస్ రైలు సర్వీసులు అక్టోబర్‌ 7, 9 తేదీల్లో రద్దవుతాయి.


18213 దుర్గ్-అజ్మీర్ ఎక్స్‌ప్రెస్ రైలు సర్వీసులు అక్టోబర్ 6న రద్దవుతాయి.


18214 అజ్మీర్-దుర్గ్ ఎక్స్‌ప్రెస్ రైలు సర్వీసులు అక్టోబర్‌ 7న రద్దవుతాయి.


18205 దుర్గ్-నౌతన్వా ఎక్స్‌ప్రెస్ రైలు సర్వీసులు అక్టోబర్ 3న రద్దవుతాయి.


18206 నౌతన్వా-దుర్గ్ ఎక్స్‌ప్రెస్ రైలు సర్వీసులు అక్టోబర్‌ 5న రద్దవుతాయి.


08269 చిర్మిరి-చండియా రోడ్ ప్యాసింజర్ స్పెషల్ రైలు సర్వీసులు అక్టోబర్‌ 3 నుండి 11 మధ్య రద్దవుతాయి.


08270 చండియా రోడ్-చిర్మిరి-ప్యాసింజర్ స్పెషల్ రైలు సర్వీసులు అక్టోబర్ 3 నుండి 11 మధ్య రద్దవుతాయి.


05755 చిర్మిరి-అనుప్పూర్ ప్యాసింజర్ స్పెషల్ రైలు సర్వీసులు అక్టోబర్‌ 5, 8, 10 తేదీల్లో రద్దవుతాయి.


05756 అనుప్పూర్-చిర్మిరి ప్యాసింజర్ ప్రత్యేక రైలు సర్వీసులు అక్టోబర్‌ 5, 8, 10 తేదీల్లో రద్దవుతాయి.


06617 కట్ని-చిర్మిరి రైలు సర్వీసులు అక్టోబర్ 2 నుండి అక్టోబర్ 10 మధ్య రద్దవుతాయి.


06618 చిర్మిరి-కట్ని ప్రత్యేక రైలు సర్వీసులు అక్టోబర్ 3 నుండి అక్టోబర్ 11 మధ్య రద్దవుతాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com