ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కాజల్ అగర్వాల్ గ్లామర్ షో

cinema |  Suryaa Desk  | Published : Tue, Apr 23, 2024, 02:20 PM

తన కెరీర్ బిగినింగ్ నుంచి ఇప్పటి వరకు గ్రాఫ్ స్టడీగా మైంటైన్ చేస్తున్న హీరోయిన్ కాజల్ అగర్వాల్. తెలుగు, తమిళ భాషల్లో కాజల్ దాదాపుగా స్టార్ హీరోలందరితో స్క్రీన్ షేర్ చేసుకుంది.తన కెరీర్ బిగినింగ్ నుంచి ఇప్పటి వరకు గ్రాఫ్ స్టడీగా మైంటైన్ చేస్తున్న హీరోయిన్ కాజల్ అగర్వాల్. తెలుగు, తమిళ భాషల్లో కాజల్ దాదాపుగా స్టార్ హీరోలందరితో స్క్రీన్ షేర్ చేసుకుంది. టాలీవుడ్ లో ఎక్కువ విజయాల శాతం ఉన్న హీరోయిన్ కూడా కాజలే. కమర్షియల్ చిత్రాలతో కాజల్ తిరుగులేని స్టార్ డమ్ సొంతం చేసుకుంది. వివాహం తర్వాత కూడా కాజల్ అగర్వాల్ మంచి అవకాశాలతో రాణిస్తోంది. కాజల్ కెరీర్ మొత్తంలో ఆమె సక్సెస్ గ్రాఫ్ ఎప్పుడూ పడిపోలేదు. ఇది కాజల్ కు మాత్రమే సాధ్యమైన ఘనత. కాజల్ అగర్వాల్ 2020 అక్టోబర్ లో తన స్నేహితుడు గౌతమ్ కిచ్లుని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వివాహం తర్వాత ఈ జంట వెకేషన్స్ కి వెళుతూ మ్యారేజ్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నారు.  కాజల్ అగర్వాల్ చివరగా నందమూరి బాలకృష్ణ భగవంత్ కేసరి చిత్రంలో నటించింది. ఇటీవల విడుదలైన ఈ చిత్రం మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంది. కాజల్ అగర్వాల్ చిన్న గ్యాప్ తర్వాత మరోసారి భగవంత్ కేసరితో టాలీవుడ్ లో యాక్టివ్ అయింది. తాజాగా కాజల్ ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసిన ఫొటోస్ వైరల్ అవుతున్నాయి. కాజల్ అగర్వాల్ గ్లామర్ గా కనిపించడం చూస్తూనే ఉన్నాం. అయితే ఎవ్వరూ ఊహించని విధంగా కాజల్ తాజాగా సడెన్ గా గ్లామర్ ఫోటోలు షేర్ చేసింది. ఈ ఫొటోల్లో కాజల్ గ్లామర్ ని కాస్త ఎక్కువగా ప్రదరిస్తోంది అని చెప్పొచ్చు. పెళ్లి తర్వాత కూడా తాను గ్లామర్ రోల్స్ చేస్తానని కాజల్ ఇలా పరోక్షంగా చెబుతోందా అంటూ నెటిజన్లు చర్చించుకుంటున్నారు. కాజల్ లేటెస్ట్ ఫొటోస్ సోషల్ మీడియా మొత్తం తెగ వైరల్ అవుతున్నాయి. 



 


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com