ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'గగనానికి ఉదయం ఒకటే' పాట లిరిక్స్

cinema |  Suryaa Desk  | Published : Wed, Jan 11, 2023, 09:41 AM

పల్లవి:
గగనానికి ఉదయం ఒకటే
కెరటాలకి సంద్రం ఒకటే
జగమంతట ప్రణయం ఒకటే ఒకటే

ప్రణయానికి నిలయం మనమై
యుగయుగముల పయనం మనమై
ప్రతి జన్మలో కలిశాం మనమే మనమే

జన్మించలేదా నీవు నా కోసమే
గుర్తించలేదా నన్ను నా ప్రాణమే

ప్రేమా ప్రేమా ప్రేమా ప్రేమా

చరణం 1:
నీ కన్నుల్లో కలను అడుగు ఇతడు ఎవరినీ
నీ గుండెల్లో పెరిగే లయని బదులు పలకనీ
నిదురించు యవ్వనంలో పొద్దు పొడుపై
కదిలించలేదా నేనే మేలుకోలుపై
గత జన్మ జ్ఞాపకాన్నై నిన్ను పిలువా
పరదాల మంచు పొరలో ఉండగలవా

చరణం 2:
నా ఊహల్లో కదిలే కలలే ఎదుట పడినవి
నా ఊపిరిలో ఎగసే సెగలే కుదుట పడినవి
సమయాన్ని శాశ్వతంగా నిలిచిపోనీ
మమతన్న అమృతంలో మునిగిపోనీ
మనవైన ఈ క్షణాలే అక్షరాలై
మృతి లేని ప్రేమ కథగా మిగిలిపోనీ






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com