ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'సమ్మతమే' ట్రైలర్ కోసం డేట్ అండ్ టైమ్ లాక్

cinema |  Suryaa Desk  | Published : Wed, Jun 15, 2022, 02:45 PM

టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోస్ లో కిరణ్ అబ్బవరం ఒక్కరు. ఈ హీరో ప్రస్తుతం రొమాంటిక్ లవ్ స్టోరీ ట్రాక్ లో రానున్న 'సమ్మతమే' సినిమాలో కనిపించనున్నారు. చాందిని చౌదరి ఈ సినిమాలో కిరణ్ సరసన జంటగా నటిస్తోంది. గోపీనాథ్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా పూర్తి కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా ఉంటుందని భావిస్తున్నారు. జూన్ 24, 2022న ఈ సినిమా థియేటర్లలో విదుదల కానుంది. తాజా అప్డేట్ ప్రకారం, ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను జూన్ 16, 2022న సాయంత్రం 04:05 గంటలకు విడుదల చేయనున్నట్లు మూవీ మేకర్స్ ప్రకటించారు. ఇదే విషయాన్ని తెలియజేసేందుకు మూవీ మేకర్స్ ఒక స్పెషల్ పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. శేఖర్ చంద్ర ఈ చిత్రానికి సంగీతం అందించారు. యుజి ప్రొడక్షన్స్ బ్యానర్‌పై కంకణాల ప్రవీణ  ఈ సినిమా నిర్మిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com