కర్నూలు లో సర్కారువారిపాట మూవీ సక్సెస్ సెలెబ్రేషన్స్ చాలా గ్రాండ్ గా జరిగాయి. మ మ మాస్ సెలబ్రేషన్స్ పేరిట SVP విజయోత్సవ వేడుకలు నిన్న సాయంత్రం ఎస్ టి బి సి గ్రౌండ్స్ లో జరిగాయి. కామ్ గా, సైలెంట్ గా ఉండే మహేష్ కెరీర్ లోనే తొలిసారి స్టేజిపై డాన్సులు వేసాడు. దీంతో ఒక్కసారిగా అక్కడి వాతావరణం ఫ్యాన్స్ ఈలలతో, చప్పట్లతో మారుమోగిపోతుంది. మ మ మ మహేష్ పాటకు స్టేజిపై కొంతమంది డాన్సర్లు డాన్స్ వేస్తుండగా, కింద సీట్లో కూర్చున్న మహేష్ లేచి పైకి వచ్చి డాన్సర్లతో కలిసి స్టెప్స్ వేసాడు. మహేష్ తో కలిసి తమన్ కూడా కాలు కదిపారు. దీంతో మ మ మ మహేష్ సక్సెస్ సెలెబ్రేషన్స్ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. పరశురామ్ డైరెక్షన్లో, కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో కీర్తిసురేష్ కథానాయిక. ఈ సినిమాలో మహేష్ చాలా స్టైలిష్ గా కనిపిస్తూనే ఊర మాస్ యాక్టింగ్ తో, డైలాగ్స్ తో ప్రేక్షకాభిమానులకు పూనకాలు తెప్పించాడు. ఇక ఈ సినిమాలోని పాటలైతే వేరే లెవెల్. తమన్ మ్యూజిక్, శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ ఈ సినిమా సక్సెస్ కు చాలా సహాయపడ్డాయి.