ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మేజర్ చిత్రానికి సంబంధించిన సర్ప్రైజ్

cinema |  Suryaa Desk  | Published : Tue, May 03, 2022, 12:13 PM

అడివి శేష్ హీరోగా శశి కిరణ్ తిక్క దర్శకత్వం లో తెరకెక్కిన చిత్రం మేజర్. బయోగ్రాఫికల్ యాక్షన్ డ్రామా గా వస్తున్న ఈ చిత్రం ను మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవితం లోని నిజ జీవిత సంఘటనల ఆధారంగా రూపొందిస్తున్నారు. సోని పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, GMB ఎంటర్ టైన్మెంట్స్ మరియు a+s మూవీస్ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం లో శోభిత ధూళిపాళ, సాయి మంజ్రేకర్ లేడీ లీడ్ రోల్స్ లో నటిస్తుండగా, ప్రకాష్ రాజ్ కీలక పాత్ర లో నటిస్తున్నారు.ఈ చిత్రం ను త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది. ఈ మేరకు ఇందుకు సంబంధించిన ప్రమోషన్స్ ను షురూ చేయనుంది. తాజాగా సోషల్ మీడియా ద్వారా హీరో అడివి శేష్ లేటెస్ట్ అప్డేట్ ను వెల్లడించారు. త్వరలో మేజర్ చిత్రానికి సంబంధించిన సర్ప్రైజ్ ఉండనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రం పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com