తిరుమల శ్రీవారికి హుండీ ద్వారా రూ. 4. 63 కోట్లు ఆదాయం లభించిందని తిరుమల తిరుపతి దేవస్థానం తెలిపింది. ఆదివారం వచ్చిన మొత్తం ఆదాయాన్ని సోమవారం లెక్కించారు. సోమవారం 70, 408 మంది భక్తులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. 34, 932 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారని టీటీడీ అధికారులు వెల్లడించారు.