రేప్ కేసులో అడ్డంగా దొరికిపోయి రోహ్తక్ జైల్లో ఊచలు లెక్కపెడుతున్న డేరా సచ్చా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ హైకోర్టుకు వెళ్లాడు. తనకు ప్రత్యేక సీబీఐ కోర్టు విధించిన 20 ఏళ్ల జైలు శిక్షను డేరా బాబా సవాల్ చేశాడు. ఆగస్ట్ 25న రెండు రేప్ కేసుల్లో గుర్మీత్‌ను దోషిగా తేల్చింది పంచకుల సీబీఐ కోర్టు. 20 ఏళ్లు జైలు శిక్ష విధించి అతన్ని రోహ్తక్లోని సునరియా జైలుకి తరలించారు. అంతేకాదు అతనికి రూ.30 లక్షల జరిమానా కూడా విధించింది. ఇందులో నుంచి బాధితురాళ్లు ఇద్దరికీ చెరో రూ.14 లక్షలు ఇవ్వనున్నారు.