పూణె: భారత పర్యటనకు వచ్చిన ఆసిస్ జట్టు కోహ్లీ సేనతో నాలుగు టెస్ట్ మ్యాచ్‌లు ఆడనుంది. ఈ సిరీస్ దగ్గరపడుతున్న కొద్దీ ఆసిస్ జట్టు చేసే స్లెడ్జింగ్‌పై, అందుకు కోహ్లీ స్పందనపై చర్చలు నడుస్తున్నాయి. అయితే ఆసిస్ ఆటగాళ్లు మైక్ హస్సీ, గ్లేన్ మాక్స్వెల్, డేవిడ్ వార్నర్ వంటి వారు కోహ్లీని రెచ్చగొట్టే విధంగా చేయకూడదంటూ వ్యాఖ్యానించారు. కానీ ఆసిస్ స్పీడ్ బౌలర్ మిచెల్ స్టార్క్‌ను స్లెడ్జింగ్ చేయకుండా కట్టడి చేయడం కష్టమే. అందులోనూ కోహ్లీ కూడా టాప్ ఆర్డర్లో బ్యాటింగ్‌కు వస్తాడు. దీంతో వీరిరువురి మధ్య పోరు ఆసక్తికరంగా ఉండనుంది. స్టార్క్ వేసే స్వింగ్ బంతులను కోహ్లీ ఎదుర్కొనే తీరు చూడాల్సిందే. వీరిరువురి దంగల్ వీక్షకులకు మంచి కిక్ ఇవ్వనుంది.