చేసిన వంటలే.. చేసుకుని బోర్ కొడుతుందా? కొత్తగా ఏమన్న ట్రై చేయాలనుకుంటున్నారా? అయితే రాజస్థాని రోటీ ట్రై చేయండి. డిఫరెంట్ టేస్ట్ కావాలనుకునేవారికి ఇది చాలా బాగుంటుంది. ఇంట్లో ఉండే గోధుమ పిండితోనే దీనిని తయారు చేసుకోవచ్చు. ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.
గోధుమ పిండి, ఉప్పు, జీరా, బేకింగ్ పౌడర్, కావలసిన నీళ్లు వేసుకుని పిండిని కలిపి ముద్ద చేసి ఉంచుకోవాలి. దానిపై తడి బట్ట కప్పి ఉంచాలి. తర్వాత వాటిని చిన్న చిన్న ఉండలుగా చేసుకుని అరచేతిలో గుండ్రంగా చేసుకుని ఆ పిండి ముద్దను రోటీలా చేతితో ఒత్తాలి. తర్వాత వాటిని పెనం వేడి చేసి రెండు వైపుల కాల్చి.. గట్టిగా అయిన తర్వాత తీయాలి. ఈ కాల్చినవి ట్రేలో పెట్టి ఓవెన్లో అరగంటసేపు పాటు బేక్ చేయాలి.. బేక్ అయి ఉంటాయి. అలా అయిన వాటిని నేతిలో వేసి ఉంచాలి. అంతే రాజస్థాని రోటీ రెడీ. అలా సిద్ధమైన వాటిని వేడిగా కూర లేదా దాల్తో తింటే చాలా బాగుంటాయి.
కావాల్సిన పదార్ధాలు..
గోధుమ పిండి - రెండు కప్పులు
జీరా - ఒక టేబుల్ స్పూన్
ఉప్పు - రెండు టీ స్పూన్లు
బేకింగ్ పౌడర్ - అర టీ స్పూన్
నీళ్లు - అర కప్పు
నెయ్యి లేదా వెన్న - 75 గ్రా