ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బాబు బాగా బిజీ రివ్యూ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, May 06, 2017, 11:52 AM

బాబు బాగా బిజీ గురించి మాట్లాడుకునే కంటే ముందు దృశ్యం, ప్రేమమ్, ఊపిరి, ధృవ సినిమాల గురించి ఓ ముక్కలో మాట్లాడుకుందాం. మనం చెప్పుకున్న ఆ నాలుగు సినిమాలు కూడా రీమేక్ సినిమాలే. అలాగని మక్కీకి మక్కీ దింపేయలేదు. చాలా సీన్స్ ఒరిజినల్ నుంచి వాడుకున్నప్పటికీ... మనకంటూ కొన్ని ఎమోషన్స్, టేస్టులున్నాయి. వాటిని ఎక్కడా మిస్ కాకుండా.. మాతృకలోని ఫీల్, సోల్ అంటాం కదా అవి మిస్ కాకుండా జాగ్రత్తగా కొన్ని కొత్త సీన్స్ రాసుకొని తీశారు. అందుకే అవి సూపర్ హిట్లయ్యాయి. దర్శకులకు పేరు... నిర్మాతలు డబ్బులు వచ్చాయి. ఇక బాబు బాగా బిజీ విషయానికి వస్తే... హిందీలో హిట్టయిన హింటర్ సినిమా రీమేక్. హంటర్ సినిమాలో ఓ నాలుగు ముద్దు సీన్స్, డబుల్ మీనింగ్ డైలాగ్స్ తో రసవత్తరంగా సాగుతుంది. అయితే కేవలం రొమాంటిక్ సీన్స్ ఉన్నాయి కాబట్టి ఆడిందనుకునేరు. అందులో ఫీల్ ఉంది. చిన్నప్పుడు మనం చేసిన అల్లరి పనులకు కనెక్ట్ అవుతాం. కాలేజ్ ఏజ్ లో చేసిన తుంటరి పనులు మళ్లీ గుర్తుకు తెచ్చాడు హిందీ దర్శకుడు. అలా హంటర్ సినిమాలోని సీన్స్ హాంటింగ్ లా మిగిలాయి. ఇవన్నీ ఫ్రీమేక్ చేసిన బాబు బాగా బిజీలో మాత్రం కనిపించలేదు. సేమ్ సీన్స్ బట్ ఫీల్ మిస్. సేమ్ సిట్యూవేషన్స్ బట్ సోల్ మిస్. సేమ్ సినిమా అక్కడ హిట్ ఇక్కడ ఫట్.


నకల్ బీ అకల్ సే మార్ నా అంటారు. కానీ దర్శకుడు నవీన్ మేడారం... హంటర్ సినిమాను సరిగ్గా కాపీ చేయలేకపోయాడు. ఒరిజినల్ ను కాసేపు పక్కన పెడతాం. పేరుకే టైటిల్ లో బిజీ... కానీ సినిమా మాత్రం చాలా స్లోగా వెళ్తుంది. నటీనటుల పెర్ ఫార్మెన్స్ చాలా కృతకంగా ఉంది. సన్నివేశాలు సహజంగా లేవు. డైలాగ్స్ లో చాలా వరకు ఇంగ్లిష్ వాడారు. వాడిన ఇంగ్లిష్ కూడా మనకు అర్థం కానంతగా... బహుషా ఏ సెంటర్ ప్రేక్షకుల్ని మాత్రమే టార్గెట్ చేసినట్టున్నారు. అవసరాల శ్రీనివాస్ హెయిర్ స్టైయిల్ ఎవరు సెలక్ట్ చేశారో..కానీ వారికో దండం. చూడటానికి డిఫరెంట్ గా ఉండాలి అన్నప్పుడు... చూసే ప్రేక్షకుడికి నచ్చుతుందా లేదా అని కూడా ఆలోచించాలి కదా. యూత్ చాలా ఫాస్ట్ గా ఉన్నారు. అలాంటప్పుడు సినిమా స్లోగా ఎందుకు ఉండాలి. కాస్త స్పీడ్ గా చెప్పి ఉంటే... ఊపు ఉండేదేమో.


ఈ సినిమాకు రిఫ్రెష్ మెంట్ అంటే కేవలం సుప్రియ ఐసోల మాత్రమే. చంద్రిక క్యారెక్టర్లో ఆంటీగా మెప్పించింది. ఉన్నది కొద్దిసేపే అయినా... రొమాంటిక్ సీన్స్ లోనూ కైపెక్కించింది. ఈమె సీన్స్ ఇంకో నాలుగు ఉంటే బాగుండనిపించింది. ఈసినిమా ట్రైలర్ రిలీజ్ అయినప్పటి నుంచే సుప్రియ గురించి డిస్కషన్ బాగా జరిగింది. అందుకు తగ్గట్టుగానే కళ్లతోనే సెక్సీ ఎక్స్ ప్రెషన్స్ పండించింది. ఈ సినిమాకు ఓ టిక్కెట్ తెగిందంటే కారణం మాత్రం సుప్రియ మాత్రమే. పాటలు, కెమెరా వర్క్, డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఓకే. ఎడిటింగ్ వీక్. నిర్మాతలు తమ తొలి చిత్రం స్ట్రైయిట్ సినిమా చేసి ఉంటే బాగుండేది. రీమేక్ చేయాలి అనుకున్నప్పుడు కాస్త సమయం తీసుకొని మక్కీ కి మక్కీ కాకుండా సీన్స్ చాలా వరకు మార్చాల్సింది. లేదా ఫీల్ మిస్ కాకుండా చూసుకోవాల్సింది. ఇలాంటి సినిమాల వల్ల నాలుగు డబ్బులు వస్తాయేమో. నలుగురికి బ్యానర్ గురించి తెలుస్తుందేమో. కానీ బ్యానర్ వాల్యూ పడిపోతుంది.


రివ్యూ : 2


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com