ఇటీవల ట్విట్టర్ ఫ్లాట్ ఫాం నిబంధనలకు విరుద్ధంగా వైఎస్ జగన్ ఫేయిల్డ్ యాస్ సీఎంతో పాటు సేవ్ నల్లమల అనే యాష్ ట్యాగ్‌తో సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ చేశారని అకౌంట్లను సస్పెండు చేసిన విషయం తెలిసిందే. తాజాగా మళ్ళీ సస్పెండ్ అయిన అకౌంట్స్ పునరుద్దరించడంతో పవన్ కళ్యాణ్ ట్విట్టర్ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు. రాజ్యాంగబద్ధమైన వ్యక్తీకర స్వేచ్చని సమర్ధించి త్వరగా రెస్పాన్స్ అయినందుకు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు అంటూ పవన్ తన ట్విట్టర్లో పోస్ట్ పెట్టారు.