ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మహేష్ స్పైడర్ సాటిలైట్ రైట్స్ ధర ఎంతో తెలుసా ?

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Apr 13, 2017, 04:14 PM

మహేష్ బాబు అభిమానుల కోరిక తీరింది. ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న మహేష్-మురగదాస్ ల స్పైడర్ ఫస్ట్ లుక్ వచ్చేసింది. ఇప్పుడు ఈ సినిమా చర్చ మొదలైంది. తాజాగా ఈ సినిమా శాటిలైట్ రైట్స్ ని జీటీవీ సొంతం చేసుకుంది. హిందీ, తెలుగు, తమిళ వెర్షన్ హక్కులని భారీ ధరకి దక్కించుకున్నట్లు తెలుస్తుంది. ఈ ఫిగర్ ఎంత అనేది ఇంకా చెప్పడం లేదు.దాదాపు 100 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాని తెలుగు, తమిళ భాషల్లో విడుదల చేయనున్నారు. హిందీలో డబ్ చేసి విడుదల చేయనున్నాడు దర్శకుడు. ఇప్పటికే స్పైడర్ ప్రీరిలీజ్ బిజినెస్ అదిరిపోయే రేంజ్ లో జరిగినట్లు తెలుస్తుంది. దాదాపు 150కోట్ల ప్రీరిలీజ్ బిజినెస్ జరిగినట్లు చెబుతున్నారు. ఈ చిత్రంలో మహేష్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ జతకట్టనుంది. సంగీతం హరీష్ జయరాయ్. ఈ సినిమా రంజాన్ కానుకగా జూన్ 23న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com