ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విశ్వమంతా...బాహుబలి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Mar 28, 2017, 01:45 AM

విశ్వమంత ఎదురు చూస్తోంది బాహుబలి-2 ఎప్పుడెప్పుడా అని ప్రపంచస్థాయి ప్రమాణాలతో అతనంత అద్భుతంగా నిర్మాణమైన బాహుబలి-2 సినీ ప్రపంచంలోనే కనీ వినీ ఎరుగని రీతిలో సంచలన విజయం సాధిస్తుందని సినీ రంగ నిపుణులు అంటున్నారు. ప్రభాస్‌, అనుష్క, తమన్నా, రానా, రమ్యకృష్ణ, నాజర్‌ ప్రధాన తారాగణంగా ఎస్‌.ఎస్‌.రాజమౌళి దర్శకత్వంలో కె.రాఘవేంద్రరావు సమర్పణలో ఆర్కా మీడియా వర్క్‌‌స బ్యానర్‌పై శోభుయార్లగడ్డ, ప్రసాద్‌ దేవినేని నిర్మాతలుగా రూపొందుతోన్న చిత్రం ’బాహుబలి2‘. ఎం.ఎం.కీర్వాణి సంగీతం అందించిన ఈ సినిమా ప్రి రిలీజ్‌ ఫంక్షన్‌ ఆదివారం హైద్రాబాద్‌ రామోజీ ఫిలింసిటీలో జ్రిగింది.


ఈ కార్యక్రమంలో రెబల్‌ స్టార్‌ కృష్ణంరాజు, కరణ్‌ జోహార్‌, ఎస్‌.ఎస్‌.రాజమౌళి, ప్రభాస్‌, రానా, ఎం.ఎం.కీరవాణి, సత్యరాజ్‌ నాజర్‌‌‌, రమ్యకృష్ణ, అనుష్క,  తమన్నా విజయేంద్రప్రసాద్‌, నాని, రమా రాజమౌళి, వల్లీ, సాబుసిరిల్‌, నిమ్మగడ్డ ప్రసాద్‌, సుబ్బరాజు, డి.సురేష్‌బాబు, లహరి మ్యూజిక్‌ అధినేత మనోహర్‌ నాయుడు టి సిరీస్‌ ప్రతినిధి శివ్‌,ఎ.ఎం.డి.ప్రతినిధి రాజమౌళి, కమల్‌ కన్నన్‌, ప్రశాంతి త్రిపిరనేని తదితరులు పాల్గొన్నారు.


రమ్యకృష్ణ్ణ మాట్లాడుతూ - ‘‘బాహుబలి గురించి ఎంత మాట్లాడినా తక్కువే. రాఘవేందర్రావు, విజయేంద్రప్రసాద్‌, రాజమౌళిగారు, ప్రభాస్‌, రానా, అనుష్క్‌, తమన్నా సహా అందరికీ థాంక్స్‌. డైరెక్టర్‌ విజయ్‌ను నమ్ముకుని ఐదేళ్ళు వర్క్‌ చేయడం నా కెరీర్‌లో చూడలేదు. ఇంత గొప్ప సినిమాలో పార్ట్‌ అయినందుకు అదృష్టంగా భావిస్తున్నాను‘‘ అన్నారు. 


తమన్నా మాట్లాడుతూ - ‘‘నేను ఎక్క్డికి వెళ్ళినా న్న్ను తెలుగు అమ్మాయిలానే చూస్తారు. తెలుగు ప్రేక్ష్కులు న్న్నంత్గా ఆద్రించారు. ఎక్క్డికి వెళ్ళినా..నాకు వచ్చిన రెస్పాన్స్‌ చూసి ఒక న్టికి ఇంత ఆదరణ వస్తుందని ఉహించట్లేదు.బాహుబలి వన్స్‌ ఇన్‌ లైఫ్‌ టైం మూవీ. ఈ అవకాశం ఇచ్చిన ప్రభాస్‌ స్వీటి, రానా,్‌, నాజర్‌, సాబుసిరిల్‌, వల్ల్లీ, రానా రాజమౌళిగారు సహా అందరికీ థాంక్స్‌‘‘ అన్నారు.


రెబల్‌ స్టార్‌ కృష్ణంరాజు మాట్లాడుతూ - ‘‘విజయేంద్రప్రసాద్‌, కీరవాణి సహా ఫ్యామిలీ అందరూ మాకెంతో మంచి మిత్రులు. బాహుబ్లి సినిమా ప్రపంచంలో తెలుగు సినిమాను ఎక్కడికో తీసుకెళ్ళింది. స్పీల్‌బ్రర్గ్‌‌గగారిని ఇండియన్‌ సినిమా ఇండస్ట్రీ గురించి అడగ్గా ముందు ఆయన సమాదానం చెేప్పేట్లుదు. తెలుగులోను ఇంత గొప్ప దర్శకులు, ఇంత గొప్ప నిర్మాతలు, సాంకేతిక నిపుణులు, నటులు ఉన్నందుకు చాలా గర్వంగా ఉంది. సినిమా రంగంలో నాది యాభై ఏళ్ల ప్రస్థానం. ఈ ప్రయాణంలో చాలా మంది రాజకీయ నాయకుల్ని కలుసుకొన్నా. వాళ్లంతా సినిమా గురించి చాలా చులకనగా మాట్లాడేవాళ్లు. ఇప్పుడు మాత్రం ఎక్కడకు వెళ్తున్నా బాహుబలి గురించే చర్చ.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com