ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రోగ్‌ యూత్‌ ఎంటర్‌టైనర్‌

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Mar 28, 2017, 01:38 AM

డాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో ఇషాన్‌ హీరోగా జయాదిత్య సమర్పణలో తన్వి ఫిలింస్‌ పతాకంపై డా సి.ఆర్‌.మనోహర్‌, సి.ఆర్‌.గోపి నిర్మిస్తున్న లవ్‌ ఎంటర్‌టైనర్‌ ’రోగ్‌’(మరో చంటిగాడి ప్రేమకథ). ఈ సినిమాను మార్చి 31న వరల్‌‌డవైడ్‌గా తెలుగు, కన్నడ భాషల్లో రిలీజ్‌ చేస్తున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు పూరి జగన్నాధ్‌తో ఇంటర్వ్యూ...


క్యూట్‌ లవ్‌ స్టోరీ....


- ఇషాన్‌ ‘రోగ్‌‘తో హీరోగా పరిచయం అవుతున్నాడు డెబ్యూ హీరో ఇంట్రడక్షన్‌ మూవీగా ఓ క్యూట్‌ లవ్‌స్టోరీ అయితే బావుంటుంది అనిపించి చేసిన క్యూట్‌ లవ్‌ స్టోరీయే ‘రోగ్‌‘.ఈ సినిమాలో కొత్త హీరో, హీరోయిన్స్‌ చేశారు. విలన్‌ అనూప్‌ సింగ్‌ ఠాకూర్‌ కూడా కొత్తవాడే.


కథ లైన్‌...


- సినిమా కలకత్తా బ్యాక్‌డ్రాప్‌లో జరుగుతుంది. అలాగే హైదరాబాద్‌, బెంగ్ళూరుల్లో కూడా సినిమాను చిత్రీకరించాం.


టైటిల్‌ గురించి...


- ఇడియట్‌ అనే టైటిల్‌ పెట్టినప్పుడు చాలా మందికి అర్థం కాకపోవచ్చనని చంటిగాడి ప్రేమకథ అని ట్యాగ్‌లైన్‌ పెట్టాను. ఇప్పుడు రోగ్‌ కూడా అలా కనెక్ట్‌ కావాలనే ట్యాగ్‌ లైన్‌పెట్టాను. నేను చాలా రోజుల తర్వాత చేసిన లవ్‌ స్టోరీ రోగ్‌. ఇడియట్‌లో హీరో చాలా యార్గెంట్‌గా ఉంటే, రోగ్‌ చిత్రంలో చాలా సైలెంట్‌గా ఉంటాడు. ఇద్దరి చంటిగాళ్ళకు తేడా ఉంటుంది.


నిర్మాతల్లు గురించి...


- నేను హీరోల్ని ఎలివేట్‌ చేసే తీరు బావుంటుందని నిర్మాతల్ని నమ్మి, ఒక మాస్‌ హీరోలా ఇషాన్‌ను పరిచయం చేయమని అడిగారు. అందుకే ఇషాన్‌ను రోగ్‌లో నా స్ట్ఙైల్లో రఫ్‌గా చూపించాను.


  నమ్మి వెళ్ళిపోతుంటాను...


- నేను కథ రాసుకుని, నిర్మాతలకు, హీరోకు చెప్పిన్ప్పుడు వాళ్ళు ఎగ్జిక్యుట్‌ అయితే సినిమాను చేసేస్తాను. సినిమా చేసే సమయంలో కథను నమ్ముకునే ఓ గ్డట్‌ ఫీలింగ్‌తో వెళ్ళిపోతుంటాను. పోకిరి సినిమా చేసే సమయంలో ఒక మంచి సినిమా తీస్తున్నాన్ని నమ్మాను కానీ, ఏదో రికార్డుల్ను క్రియేట్‌ చేసేంత పెద్ద సినిమా అవుతుందని అనుకోలేదు. ఒక సినిమా సక్సెస్‌ అనేది ఆ సినిమాతో పాటు విడుదలైన వేరే సినిమాలు విడుదల, అప్పటి పరిస్థితులు డిసైడ్‌ చేస్తాయి.అన్నీ సినిమాలు అనుకున్న ఫలితాలు రాబట్టలేవు. హాలీవుడ్‌లో షాన్‌ఫీల్డ్‌ అనే గొప్ప స్క్రీన్‌ప్లే రైటర్‌ ఉన్నారు. కొత్త దర్శకులంతా ఆయన రచనలను ఫాలో అవుతుంటారు. ఆయన రాసిన రెండు కథలను డైరెక్ట్‌ చేస్తే రెండు సినిమాలు ప్లాప్‌ అయ్యాయి.


చేంజ్‌ చేస్తే నాకు సినిమాలుండవు...


- నా సినిమాల్లో హీరోలు చాలా రఫ్‌ అండ్‌ టఫ్‌గా ఉంటారు. నా సినిమా హీరోల్ని ప్రజెంట్‌ చేసే తీరు మార్చితే నాకు సినిమాలుండవు.


ఇషాన్‌ మంచి స్టార్‌ అవుతాడు...


- ఇషాన్‌ మంచి హ్యండసమ్‌ పర్సనాలిటీ. మంచి పెర్‌ఫార్మెన్స్‌. స్క్రీన్‌ ప్రెజన్స్‌ బావుంటుంది. రోగ్‌ సినిమాను నేను చాలా మందికి చూపించాను. చూసిన వాళ్ళంద్రూ ఇషాన్‌ను అప్రిసియేట్‌ చేశారు. ఇలాంటి హీరోకు రెండు, మూడు హిట్స్‌ పెడితే తను స్టార్‌ హీరోగా ఎదుగుతాడు.


బాలకృష్ణ సినిమా గురించి...


- బాలకృష్ణగారిని నా సినిమాలో కొత్తగా చూపిస్తున్నాను. ఓ గ్యాంగ్‌స్టర్‌ పాత్‌.్ర చాలా రఫ్‌ అండ్‌ టఫ్‌గా ఉండే డైనమిక్‌ రోల్‌. ఆయన డైలాగ్స్‌ కూడా కొత్తగా ఉంటాయి. బాలకృష్ణగారితో ఐదేళ్ళ క్రితమే సినిమా చేయాల్సింది కానీ కుదల్లేదు. ఇప్పటికి కుదిరింది. ఈ సినిమాకు ఇంకా ఏ టైటిల్‌ను అనుకోలేదు. ముస్కాన్‌ అనే హీరోయిన్‌ను పరిచయం చేస్తున్నాం. సన్నీలియోన్‌ స్పెషల్‌ సాంగ్‌ కూడా పిక్చరైజ్‌ చేస్తాం. సినిమా ఫస్ట్‌ షెడ్యూల్‌ పూర్తయ్యింది. ఆయన చాలా హ్యాపీగా ఉన్నారు. మేం కూడా హ్యాపీగా ఉన్నాం.


 మీ నెక్ట్‌‌స ప్రాజెక్ట్‌‌స ...


- మెగాస్టార్‌ చిరంజీవిగారు తప్ప, మెగా హీరోల్తో సినిమాలు చేశాను. రీసెంట్‌గా ఆయున్ని వెళ్ళి కలిశాను. ఇప్పుడు బాలకృష్ణ్గాగారితో సినిమా చేస్తున్నాను కదా దాని తర్వాత ఏ విషయమనేది చెబుతాను. అలాగే వెంకటేష్‌గారి సినిమా కూడా డిస్కషన్స్‌ జరిగాయి. తదుపరి ఏ సినిమా అనేది ప్రస్త్తుతం చేస్తున్న బాలకృష్ణగారి సినిమా తర్వాతే చెబుతాను.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com