అనపర్తి : అనపర్తి మండలం రామవరం దళితవాడలోని అనపర్తిలో సహాయక బృందం చర్యలు చేపట్టింది. సహాయక చర్యల్లో రెవిన్యూ పోలీస్ పంచాయతీ రాజ్ అధికారుల బృందం పాల్గొంది. తుఫాను ప్రభావంతో రహదారులపై విరిగిపడ్డ చెట్లను తొలగింపజేస్తున్నారు.ఇదిలా ఉండగా ఉదయం నుండి ఎడతెరిపిలేని వర్షం కురుస్తోంది. ఈదురు గాలులు ఉధృతి పెరగడంతో అధికారులు విద్యుత్ నిలిపివేశారు.