ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీలోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Aug 27, 2021, 01:06 PM

ఏపీ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ పలు సంస్థల్లో భారీగా ఉద్యోగ నియామకాల కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. టీసీఎల్, రైజింగ్ స్టార్స్, హీరో మోటార్ గ్రూప్స్, టెక్ టీమ్ సొల్యూషన్స్, వీల్స్ మార్ట్ తదితర ప్రముఖ సంస్థల్లో ఉద్యోగావకాశాలున్నాయి. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని నోటిఫికేషన్ లో తెలిపారు.


ఉద్యోగ వివరాలు:


టిసిఎల్-100


రైజింగ్ స్టార్స్-100


హీరో మోటో గ్రూప్స్-100


టెక్ టీం-5


వీల్స్ మార్ట్-90


విద్యార్హత వయసు తదితర వివరాలు:


టిసిఎల్ లో అసెంబ్లీ/రీ వర్క్/టెస్టింగ్ సెక్షన్ లో ఖాళీలను భర్తీ చేస్తున్నారు. ఈ పోస్టులకు టెన్త్, ఇంటర్, డిగ్రీ, బీటెక్ చేసిన అర్హులు. అభ్యర్థుల వయస్సు 19-30 మధ్య ఉండాలి. ఎంపికైన అభ్యర్థులు చిత్తూరు జిల్లాలోని రేణిగుంటలో పని చేయాల్సి ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు రూ.12, 014 జీతం ఉంటుంది. ఉచితంగా భోజనం, వసతి, రవాణ సదుపాయం కల్పించనున్నారు. .


రైజింగ్ స్టార్: ఈ సంస్థలో అసెంబ్లిగ్ ఆపరేటర్ విభాగంలో ఖాళీలను భర్తీ చేయనున్నారు. టెన్త్, ఇంటర్, డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు అర్హులు. వయస్సు 18-32 ఏళ్ల మధ్య ఉండాలి. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.10, 200 వరకు వేతనం చెల్లించనున్నారు. ఉచిత భోజనం, వసతి సదుపాయం ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులు నెల్లూరు జిల్లాలోని శ్రీ సిటీలో పని చేయాల్సి ఉంటుంది.


హీరో మోటో గ్రూప్స్: ఈ సంస్థలో ప్రొడక్షన్ ఆపరేటర్ విభాగంలో ఖాళీలు భర్తీ చేయనున్నారు. ఈ మేరకు నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఐటీఐ(పురుషులు), ఇంటర్(స్త్రీలు) అర్హత కలిగిన అభ్యర్థులు ఈ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవచ్చు. వయస్సు 18-25 ఏళ్ల మధ్య ఉండాలి. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.14,977 వేతనం చెల్లిస్తారు. వీరు శ్రీ సిటీలో పని చేయాల్సి ఉంటుంది.


టెక్ టీం : ఈ సంస్థ టెక్నికల్ ట్రైనర్ విభాగంలో ఖాళీలను భర్తీ చేయనుంది. ఈ మేరకు డిప్లొమా/బీటెక్ ఈసీఈ(ఫ్రెషర్స్) అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. వయస్సు 26 ఏళ్ల లోపు ఉండాలి. ఎంపికైన అభ్యర్థులకు ఏడాదికి రూ.1.2 లక్షల నుంచి రూ.1.8 లక్షల వరకు వేతనం ఉంటుంది. విజయనగరంలో పని చేయాల్సి ఉంటుంది.


వీల్స్ మార్ట్: ఈ సంస్థలో సేల్స్, కలెక్షన్, ఎగ్జిక్యూటీవ్స్, అకౌంటెంట్స్ విభాగంలో ఖాళీలు ఉన్నాయి. డిగ్రీ ఉట్టెర్ణులైన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. వయసు 19 నుంచి 30 ఏళ్ల మధ్య లో ఉండాలి. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.8 వేల నుంచి రూ.10 వేల వరకు వేతనం ఉంటుంది. విశాఖపట్నం, విజయనగరంలో పని చేయాల్సి ఉంటుంది.


ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవాలి అనుకునే అభ్యర్థులు https://apssdc.in/home/ లింక్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఉద్యోగాలకు ఆగష్టు 31న ఉదయం 10 గంటల నుంచి ఇంటర్వ్యూ లు నిర్వహించనున్నారు.


ఇంటర్వ్యూ జరిగే వేదిక:


ఆర్.కే జూనియర్ కాలేజీ&డిగ్రీ కాలేజీ


ఆర్.కే ప్యాలస్ మయూరీ జంక్షన్


విజయనగరం జిల్లా


మరిన్ని వివరాల కోసం ఫోన్ చేయాల్సిన నెంబర్లు: 7989826953, 9000102013






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com