మెక్సికన్ ఆర్మీకి చెందిన ఓ హెలికాప్టర్ గాల్లోకి లేచిన కాసేపటికే కుప్పకూలింది. ఈ ఘటనలో నలుగురు సైనికులు గాయపడ్డారు. మెక్సికోలోని హిడాల్గో రాష్ట్రంలో ఈ ప్రమాదం జరిగింది. టేకాఫ్ అయిన తర్వాత హెలికాప్టర్ బ్యాలెన్స్ కోల్పోయింది. మెక్సికన్ నేవీకి చెందిన ఈ హెలికాప్టర్ గ్రేస్ హరికేన్ ప్రభావిత ప్రాంతాల్లో చిక్కుకున్న వారిని రక్షించడానికి ప్రయత్నిస్తోంది. అయితే ఇంతలో అది ప్రమాదానికి గురయ్యింది. ప్రమాదంలో గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. హెలికాప్టర్ మొదట వ్యాన్ ను ఢీకొట్టి, ఆపై కారుపైకి పడుతుంది. ఊహించని సంఘటన జరగడంతో అక్కడి నుంచి ప్రజలు భయంతో పరుగెత్తి ప్రాణాలను కాపాడుకున్నారు.