ట్రెండింగ్
Epaper    English    தமிழ்

లవంగాలు తింటే కలిగే ప్రయోజనాలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Apr 14, 2021, 10:42 AM

లవంగాలు అందరి ఇళ్లల్లో ఉంటాయి. పలు వంటకాల్లో లవంగాలను ఉపయోగిస్తుంటారు. లవంగాలతో ఆహార పదార్థాలకు రుచి రావడమే కాదు.. అవి ఆరోగ్యానికి ఎంతో ఉపయోగమంటున్నారు వైద్య నిపుణులు. మరి ఈ లవంగాల వల్ల ఎలాంటి ప్రయోజనాలున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
- లవంగాలు నోట్లో వేసుకుంటే నోటి నుంచి వచ్చే దుర్వాస‌న త‌గ్గిపోతుంది. నోట్లో ఉండే బాక్టీరియా, క్రిములు న‌శిస్తాయి. చిగుళ్లు ఆరోగ్య వంతంగా ఉంటాయి. దంతక్షయం బారిన పడరు.
- క‌డుపులో బాగా వికారంగా అనిపించినా, ఆహారం జీర్ణం కాక‌పోయినా.. గ్యాస్ సమస్యలున్నా.. లవంగాలను నోట్లో వేసుకొని ర‌సాన్ని మింగాలి.
- లవంగాలు తింటే జ‌లుబు, ద‌గ్గు లాంటి సమస్యలు త‌గ్గిపోతాయి.
- డ‌యాబెటిస్ ఉన్న వారు ల‌వంగాన్ని తింటే షుగ‌ర్ లెవల్స్ అదుపులో ఉంటాయి. రక్త ప్రసరణ మెరుగుపడుతుంది.
- లవంగాలలో ఉండే మాంగనీసు, ఐరన్ ఎముకలను దృఢంగా మారుస్తాయి.
- లవంగాలు తింటే తలనొప్పి తగ్గే అవకాశం ఉంటుంది.
- ప్రతిరోజూ లవంగాలను తినడం వల్ల ఫ్యాట్ బర్న్ అవుతుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com