ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సుకన్య సమృద్ధి యోజన స్కీమ్ రూల్స్ సవరించిన కేంద్రం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Jul 06, 2020, 04:36 PM

కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సుకన్య సమృద్ధి యోజన స్కీమ్ రూల్స్‌ను సవరించింది. దీంతో ఈ పథకంలో చేరాలని యోచించే వారికి ప్రయోజనం కలుగనుంది.సాధారణంగా సుకన్య సమృద్ధి అకౌంట్ ఓపెన్ చేయాలంటే 10 ఏళ్లలోపు వయసు ఉండాలి. అయితే ఇప్పుడు పదేళ్లు దాటినా కూడా ఈ పథకంలో చేరొచ్చు.ఒక ఇంట్లో గరిష్టంగా ఇద్దరు ఆడపిల్లలపై ఈ ఖాతా ఓపెన్ చేయొచ్చు. అయితే కొత్త రూల్ కేవలం జూలై 31 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఇకపోతే సుకన్య సమృద్ధి యోజన స్కీమ్‌పై 7.6 శాతం వడ్డీ లభిస్తోంది. ఇతర స్మాల్ సేవింగ్ స్కీమ్స్‌లో కెల్లా ఈ పథకంపైనే ఎక్కువ వడ్డీ వస్తోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com