ట్రెండింగ్
Epaper    English    தமிழ்

2167 పోస్టుల దరఖాస్తుకు నేడే చివరి తేదీ..మిస్సవకండి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Jun 25, 2020, 02:21 PM

నిరుద్యోగులకు శుభవార్త. కేంద్రీయ కృషి వికాస్ సంస్థాన్ భారీగా ఉద్యోగాల భర్తీ చేపట్టింది. 2167 పోస్టుల్ని భర్తీ చేసేందుకు సెంట్రల్ అగ్రికల్చరల్ డెవలప్‌మెంట్ ఇన్‌స్టిట్యూషన్-CAGDI నోటిఫికేషన్ విడుదల చేసింది. బిజినెస్ రిప్రజెంటేటీవ్, అసిస్టెంట్ ఇన్వెస్ట్‌మెంట్ మేనేజర్, చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ ఆఫీసర్ లాంటి పోస్టుల్ని భర్తీ చేస్తోంది. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. దరఖాస్తు చేయడానికి 2020 జూన్ 25 చివరి తేదీ.మొత్తం 2167 ఖాళీలు ఉండగా అందులో బిజినెస్ రిప్రజెంటేటీవ్- 1036, అసిస్టెంట్ ఇన్వెస్ట్‌మెంట్ మేనేజర్- 996, చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ ఆఫీసర్- 36, ఇన్వెస్ట్‌మెంట్ మేనేజర్- 99 పోస్టులున్నాయి. వేతనాల వివరాలు చూస్తే బిజినెస్ రిప్రజెంటేటీవ్- రూ.16,680, అసిస్టెంట్ ఇన్వెస్ట్‌మెంట్ మేనేజర్- రూ.20,500, ఇన్వెస్ట్‌మెంట్ మేనేజర్- రూ.38,000, చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ ఆఫీసర్- రూ.45,000 లభిస్తుంది. వేర్వేరు పోస్టులకు 10వ తరగతి, బీకామ్, బీబీఏ, ఎంకామ్ లాంటి అర్హతలున్నాయి. 2020 మే 24 నాటికి 28 నుంచి 35 ఏళ్ల మధ్య వయస్సు ఉన్నవారు దరఖాస్తు చేయాలి. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ప్రక్రియ ఉంటుంది. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను www.cagdi.in/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com