ఒక్కసారి ఎమ్మెల్యేగా ఆశీర్వదించండి. సమస్యలు తీర్చి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని తంబళ్లపల్లె టీడీపీ అభ్యర్థి జయచంద్ర రెడ్డి అన్నారు. బుధవారం మండలాధ్యక్షుడు రెడ్డెప్పరెడ్డి, నాయకులతో కలిసి కోసువారిపల్లె ప్రసన్న వెంకటరమణ స్వామి ఆలయంలో పూజలు చేసి ప్రచారం ప్రారంభించారు. ఇంటింటికీ వెళ్లి టీడీపీ సూపర్ సిక్స్ పథకాలను వివరించారు.