ట్రెండింగ్
Epaper    English    தமிழ்

టాయిలెట్‌లో ప్రసవించిన గర్భిణీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Jun 22, 2020, 04:21 PM

ఓ మహిళ తనకు తెలియకుండానే గర్భం దాల్చింది. టాయిలెట్‌కు వెళ్లిన ఆమె అకస్మాత్తుగా బిడ్డను ప్రసవించి షాకైంది. ఈ ఘటన వెస్ట్ ససెక్స్‌లోని లిటిల్ హ్యాంప్టన్‌లో చోటుచేసుకుంది. గ్రేస్ మీచిమ్ అనే మహిళ 37 వారాల గర్బిణీ. అయితే, ఈ విషయం ఆమెకు తెలియలేదు. కడుపు కనిపించకపోవడంతో తాను గర్బంతో ఉన్న సంగతి గుర్తించలేకపోయింది. రుతుస్రావం కూడా జరగడంతో కనీసం సందేహం కూడా కలగలేదు.ఉదయం నిద్రలేచి టాయిలెట్‌కు వెళ్లింది. అంతే అకస్మాత్తుగా కడుపు నుంచి బిడ్డ బయటకు వచ్చింది. టాయిలెట్‌లో శిశువును చూడగానే గ్రేస్ గట్టిగా కేకలు పెట్టింది. దీంతో ఆమె భర్త, పెద్ద కొడుకు హుటాహుటిన గ్రేస్‌ను, బిడ్డను హాస్పిటల్‌కు తరలించారు. ప్రస్తుతం చిన్నారి క్షేమంగానే ఉంది. చిత్రం ఏమిటంటే చిన్నారి ప్రసవానికి ముందు ఆమె ప్రెగ్నెన్సీ టెస్టు కూడా చేసుకుంది. అందులో ఆమెకు నెగటివ్ చూపించింది. హాస్పిటల్‌లో చేసిన టెస్టుల్లో కూడా నెగటివ్ వచ్చింది. ఆమెకు బిడ్డ పుట్టిందనే సమాచారం తెలియగానే డాక్టర్లు కూడా ఆశ్చర్యపోయారు. అనుకోకుండా తమ జీవితంలోకి వచ్చిన ఆ బిడ్డ తమకు ఇప్పుడు ఎంతో స్పెషల్ అని గ్రేస్, ఆమె భర్త జేమ్స్ మురిసిపోతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com