ట్రెండింగ్
Epaper    English    தமிழ்

లవర్ చెప్పిన ఒక్క మాటతో ఈ యువతికి రూ.41 లక్షల జాక్‌పాట్

national |  Suryaa Desk  | Published : Sun, Apr 28, 2024, 10:49 PM

ఓ యువతికి తన లవర్ చెప్పిన ఒక్క సలహా లక్షలను తెచ్చిపెట్టింది. లాటరీ టికెట్‌ కొనుగోలు చేయాలని ఆమెకు.. లవర్ చెప్పడంతో బలవంతం మీద తీసుకుంది. అయితే రూ.800 పెట్టి కొన్న ఆ లాటరీ టికెట్‌కు ఏకంగా రూ.41 లక్షలకు పైగా జాక్‌పాట్ లభించింది. దీంతో ఆ యువతి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఇక ఆ లాటరీ టికెట్ కొనుగోలు చేసినా.. దాన్ని చెక్ చేయకుండా అలాగే ఉంచింది. చివరికి లాటరీ తీసిన తర్వాత చెక్ చేసి చూడగా.. తనకే జాక్‌పాట్ తగిలిందని తెలిసి సంతోషంతో ఎగిరి గంతేసింది. ఈ సంఘటన అమెరికాలో చోటు చేసుకుంది.


అమెరికాలోని మేరీల్యాండ్‌లో నివసించే ఓ యువతిని లాటరీ టికెట్ కొనాలని.. ఆమె ప్రియుడు సూచించాడు. అయితే లాటరీ టికెట్ కొనేందుకు ఆమె నిరాకరించింది. కానీ అతడు ఒత్తిడి చేయడంతో ఏప్రిల్ 20 వ తేదీన లాటరీ డ్రా తీయడానికి ముందు ఎట్టకేలకు ఆ లాటరీ టికెట్‌ను కొనుగోలు చేసింది. లారెల్‌ పట్టణంలోని వైస్ మార్కెట్స్‌లో 10 డాలర్లు అంటే మన భారత కరెన్సీలో రూ.80 తో క్విక్ పిక్ లాటరీ టికెట్‌ను కొనుగోలు చేసింది. ఆ తర్వాత ఆ లాటరీ టికెట్‌ను తన పర్సులో పెట్టుకుని మర్చిపోయింది. అయితే సోమవారం ఆ 


వెంటనే మేరీల్యాండ్ లాటరీ యాప్ ఓపెన్ చేసి.. తన వద్ద ఉన్న టికెట్‌ నంబర్‌ను ఎంటర్ చేసింది. అప్పుడు ఆ లాటరీలో విజేత తానే అని గుర్తించింది. దీంతో ఆ యువతి ఆనందంతో గట్టిగా అరిచింది. ఆమెకు ఆ లాటరీలో అక్షరాలా 50 వేల డాలర్లు అంటే మన భారత కరెన్సీలో రూ.41,66, 977 గెలుచుకుంది. తనకు అంత ప్రైజ్‌మనీ వస్తుందని అస్సలు ఊహించలేదని ఆ యువతి తెలిపింది. తాను ఏదో సరదాకి.. తన లవర్ చెప్తే ఆ లాటరీ టికెట్ కొనుగోలు చేసినట్లు వివరించింది. తాను గెలుచుకున్న రూ.41 లక్షలతో ఏం చేయాలో అర్థం కావట్లేదని.. అయితే తనకు ఇప్పటికే ఒక ట్రక్కు ఉందని మరో ట్రక్కు కొనుగోలు చేస్తానని వివరించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com