ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈ ఫోన్ కి ఎందుకంత క్రేజ్...?

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Jun 22, 2020, 04:19 PM

మనదేశంలో ఎక్కువమంది వాడేవి ఆండ్రాయిడ్ ఫోన్లు అయితే, ఎక్కువ మంది వాడాలి అనుకునేవి ఆపిల్ ఐఫోన్ లు, ఆపిల్ ఐ ఫోన్ అంటే ఒక బ్రాండ్, అమెరికా నుండి మన అనకాపల్లి దాకా ఐఫోన్ కి ఉండే క్రేజ్ యే వేరు, అసలు ఆపిల్ కంపెనీ ఫోన్ లకు ఎందుకంత క్రేజ్, ఆ ఫోన్ లకి ఆండ్రాయిడ్ ఫోన్ లకు ఉండే తేడా ఏంటో తెలుసుకోండి.ఆపిల్ ఐ ఫోన్- మనదేశంలో చాలామందికి ఆపిల్ ఐఫోన్ అంటే పిచ్చి, ఒక్కసారైనా ఐఫోన్ ని వాడాలి అనుకున్న వారిలో నేను ఒకడిని, కాలేజీ రోజుల్లో ఐఫోన్ గురుంచి తెలుసుకొని ఎలాగైనా వాడాలి అనుకోని ఐఫోన్ ను తీసుకున్నాను. ఫోన్ ని కొన్న తరువాత అర్థమైంది, ఆపిల్ ఐ ఫోన్ కి, ఆండ్రాయిడ్ ఫోన్ కు ఉండే తేడా, ఐఫోన్ పెర్ఫామెన్స్, ఒక్కసారి కూడా హ్యాంగ్ అవ్వకుండా ఉండటం చాలా నచ్చాయి.ఆండ్రాయిడ్, ఐఫోన్ లలో నేను గమనించిన ముఖ్య తేడా ఏంటంటే.. ఐ ఫోన్ మనల్ని ఎప్పుడు విసిగించదు, ఆండ్రాయిడ్ ఫోన్ చాలా సార్లు మనం ముఖ్యమైన కాల్స్ మాట్లాడుతున్నప్పుడు గాని, ఫోన్ లో వేరే పని చేస్తున్నపుడు కాని సడన్ గా పనిచేయడం ఆగిపోతుంది, కాని ఐఫోన్ తో అలాంటి బాధ ఎప్పుడు ఉండదు. ఆండ్రాయిడ్ ఫోన్లతో పోలీస్తే ఆపిల్ ఐఫోన్ ఎంతో మెరుగ్గా పనిచేస్తుంది,ఆండ్రాయిడ్ ఫోన్ లు మనకు రూ.5000 నుండి అందుబాటులో ఉంటాయి, పదుల రకాల కంపెనీలు, వందల రకాల మోడళ్లలో ఆండ్రాయిడ్ ఫోన్ లు మార్కెట్ లో ఉన్నాయి. కానీ ఐ ఫోన్ ని కేవలం ఆపిల్ కంపెనీ మాత్రమే తయారుచేస్తుంది, ఉండే క్రేజ్ వేరు, అసలు ఆపిల్ ఫోన్ చేతిలో ఉంది అంటే ఆ ఫీలింగ్ యే వేరేగా ఉంటుంది.మన దేశంలో ఆండ్రాయిడ్ ఫోన్ లతో పోలిస్తే ఐఫోన్ వాడేవాళ్లు సంఖ్య తక్కువ ఉన్నప్పటికి ఐఫోన్ వాడాలి అని అనుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ఐఫోన్ పనితీరు, సులభంగా అర్ధమయ్యే తీరు, అస్సలు హ్యాంగ్ అవ్వకపోవడం అనేవి ఐ ఫోన్ కి మంచి ఫీచర్స్. అలాగే ఆపిల్ ఐఫోన్ లలో కొత్త మోడల్ మార్కెట్ లోకి వచ్చినప్పుడు మన పాత ఐఫోన్ ని తిరిగి ఇచ్చేసి కొంత డిస్కౌంట్ తో కొత్త ఫోన్ ని తీసుకోవచ్చు, అలాగే సెకండ్ హ్యాండ్ మార్కెట్ లో ఐఫోన్ లకు సూపర్ డిమాండ్ ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com