ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈ వ్యాపారంతో నెలకు రూ.2 లక్షల ఆదాయం

national |  Suryaa Desk  | Published : Sat, Jun 20, 2020, 07:49 PM

అలోవెరా జ్యూస్ మేకింగ్ బిజినెస్. ఈ రోజుల్లో ప్రజలకు ఆరోగ్యంపై కొంతమేర అవగాహన పెరిగింది. ఇందులో భాగంగానే అందరూ ఆర్గానిక్ ఫుడ్స్ వైపు మొగ్గుచూపుతున్నారు. అందువలన ఆర్గానిక్ ఫుడ్ ప్రొడక్ట్స్ కు బాగా డిమాండ్ పెరిగింది. కాబట్టి ఆర్గానిక్ మార్కెట్లో అలోవెరా జ్యూస్ కు విపరీతమైన డిమాండ్ పెరిగింది. సో ఈ జ్యూస్ తయారీ మనకి ఎంతో లాభదాయకం. అసలు ఈ బిజినెస్ ను ఎలా ప్రారంభించాలి, ఏమేమి కావాలి, మార్కెటింగ్ ఎలా చేయాలి అన్న విషయాలను ఈ రోజు తెలుసుకుందాం.ఈ వ్యాపారం ప్రారంభించడానికి కావాల్సిన మిషనరీ గురించి ఇప్పుడు ఒకసారి చూద్దాం. మనకు సహజంగా సెమీ ఆటోమేటిక్ లేదా ఫుల్లీ ఆటోమేటిక్ మిషనరీ లభిస్తుంది. మనం చిన్నగా ప్రారంభించాలి కాబట్టి సెమీ ఆటోమేటిక్ మిషనరీ తీసుకుంటే మంచిది. అలోవెరా జ్యూస్ మేకింగ్ కు అలోవెరా జ్యూస్ ఎక్స్ట్రాక్షన్ మెషిన్ కావాలి. దీని ధర 2 లక్షల వరకు ఉంటుంది. ఇంకా కన్వేయర్ దీని ధర 30,000, స్క్రూ పంప్ దీని ధర 20,000, పల్వరైజర్ దీని ధర 13000, స్టోరేజ్ ట్యాంక్ ధర 25,000. ఇలా పలు రకాల మిషనరీ కావాల్సి ఉంటుంది. ఇక రా మెటీరియల్ కింద అలోవెరా అంటే కలబందను వాడుతాం. ఇక తయారీ విధానానికి వస్తే అలోవేరా పై తొక్కలను కట్ చేసి లోన భాగాన్ని వేరు చేయాలి. ఇప్పుడు ఆ ముక్కలను ఎక్స్ట్రాక్షన్ మిషన్లో పెడితే మీకు అలోవెరా జ్యూస్ సిద్ధమైపోతుంది. అలా వచ్చిన జ్యూస్ ను ఇప్పుడు స్టెర్లింగ్ చేసి బాటిల్స్ లో ఫిల్ చేసుకోని అమ్మవచ్చు. అంతేకాకుండా ఈ బిజినెస్ కు ముగ్గురు పనివారు కొద్ది పాటి ఏరియా కావాలి.ఇక ఈ బిజినెస్ లో ఖర్చులు, లాభాల గురించి తెలుసుకుందాం. మనం రోజుకు 100 లీటర్ల జ్యూస్ తయారు చేసి లీటర్ కు 150 రూపాయలు చొప్పున అమ్మితే 15 వేల రూపాయలు వస్తుంది. ఒక లీటర్ కు 50 రూపాయల వరకు ఖర్చు అవుతుంది. అయితే ఒక్కో లీటర్ మీద 100 రూపాయల వరకు లాభం మిగులుతుంది. ఇలా రోజుకు 100 లీటర్ల బిజినెస్ మీద 10 వేల రూపాయల లాభాన్ని, నెలకు మూడు లక్షల రూపాయలను సంపాదించవచ్చు. పై ఖర్చులు ఇంకో 50,000 రూపాయలు తీసేసిన రెండున్నర లక్షల రూపాయలు మిగులుతుంది.ఇక ఈ బిజినెస్ కు మార్కెటింగ్ అనేది ఎంతో ముఖ్యం. ఇంకా చెప్పాలంటే బిజినెస్ మొత్తం మార్కెటింగ్ పైనే ఆధారపడి ఉందని చెప్పవచ్చు. మనం మన ప్రొడక్ట్ ను ఆన్లైన్ లో సేల్ చేయడం, ఇంకా ఆర్గానిక్ మార్కెట్లో సేల్ చేయడం, ఫార్మా కంపెనీలతో ఎగ్రిమెంట్ చేసుకోవడం, అలాగే కాస్మెటిక్ కంపెనీస్ తో ఎగ్రిమెంట్ చేసుకోవడం వంటివి చేయాలి. ఇలా చేస్తే మనం ఈ బిజినెస్ లో చాలా సులువుగా నిలదొక్కుకోవచ్చు.చూశారు కదా ఇవాల్టి స్వయం ఉపాధి మార్గాన్ని. ఇటువంటి మార్కెటింగ్ ఆధారిత బిజినెస్ ను ప్రారంభించే ముందు తగిన పరిశోధన చేసి పూర్తి అవగాహన పొందిన తర్వాత మాత్రమే వ్యాపారం ప్రారంభించవలసింది. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com