ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డి ఈనెల 9న సినీ ప్రముఖలతో సమావేశం కానున్నారు. చిరంజీవి నేతృత్వంలో దర్శకులు, నిర్మాతలు, పంపిణీ దారులు సీఎంతో భేటీ కానున్నారు. ఈ సందర్భంగా నిర్మాత సి.కల్యాణ్ మీడియాతో మాట్లాడుతూ... సీఎం జగన్‌తో సమావేశానికి బాలకృష్ణను ఆహ్వానించినట్లు చెప్పారు. పుట్టిన రోజు వేడుకల వల్ల హాజరు కాలేనని బాలకృష్ణ తెలిపారని సి.కల్యాణ్ వెల్లడించారు. చిత్ర పరిశ్రమలో ఎలాంటి గ్రూపులూ లేవని, అందరం కలిసికట్టుగా సినీ పరిశ్రమ అభివృద్ధికి కృషి చేస్తామని వివరించారు. సినీ పరిశ్రమ అభివృద్ధి, చిత్రీకరణ అనుమతులపై సీఎంతో చర్చిస్తామని తెలిపారు.
చిరంజీవి నేతృత్వంలో ఇటీవల సినీ ప్రముఖులు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసి చిత్ర పరిశ్రమకు సంబంధించిన సమస్యలపై చర్చించారు. లాక్ డౌన్ నేపథ్యంలో సినిమా షూటింగ్‌లకు అనుమతి ఇవ్వాలని కోరగా.. సీఎం సానుకూలంగా స్పందించారు.