భువనేశ్వర్‌లోని బాలాకటి క్వారంటైన్ సెంటర్లోకి నాగుపాము రావడంతో తీవ్ర కలకలం రేగింది. పామును చూసిన వెంటనే నిర్వాహకులు స్నేక్ హెల్ప్‌లైన్‌కు ఫోన్ చేశారు. క్వారంటైన్ సెంటర్లో ఉన్నవారంతా కొంతసేపు ప్రాణాలు గుప్పిట్లో పట్టుకున్నారు. నిర్వాహకులపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్నేక్ హెల్ప్ లైన్ సభ్యుడు పామును సంచిలో బంధించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.