ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వైఎస్‌ఆర్‌ ఆరోగ్య శ్రీకి అర్హులు వీరే...

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Nov 15, 2019, 05:38 PM

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో వైఎస్‌ఆర్‌ ఆరోగ్యశ్రీ పథకం విస్తరణకు సంబంధించి ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. వార్షిక ఆదాయం రూ.5 లక్షల వరకు ఉన్న వారికి కూడా ఈ పథకాన్ని వర్తింప చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. అన్ని రకాల బియ్యం కార్డులు కలిగిన వారితో పాటు వైఎస్‌ఆర్‌ పింఛన్‌ కార్డు, జగనన్న విద్య అర్హత ఉన్న కుటుంబాలూ ఈ పథకానికి అర్హులుగా తెలిపింది.
మరోవైపు ఇతర కుటుంబాలకు వర్తించే ప్రమాణాలను కూడా ప్రభుత్వం విడుదల చేసింది. 12 ఎకరాల కన్నా తక్కువ మాగాణీ లేదా.. 35 ఎకరాల కన్న తక్కువ మెట్ట భూమి ఉన్న భూ యజమానులూ ఈ పథకానికి అర్హులే. మాగాణీ, మెట్టభూములు కలిపి మొత్తం 35 ఎకరాల కన్న తక్కువగా ఉన్న వారందరూ ఈ పథకం పరిధిలోకి వస్తారు. వీరితోపాటు ప్రభుత్వ రంగంలో పని చేస్తూ గౌరవ వేతనం పొందుతున్న ఉద్యోగులు, ప్రైవేటు ఉద్యోగులను ఏపీ ప్రభుత్వం ఈ పథకానికి అర్హులుగా ప్రకటించింది. కుటుంబంలో ఒక కారు ఉన్నవారికీ ఈ పథకం వర్తించనుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com