భారత జట్టు క్రికెటర్ హార్దిక్ పాండ్యా, సినీ నటి నటాషా ప్రేమ వ్యవహారానికి త్వరలోనే శుభం కార్డు పడనుందని సమాచారం. మొన్న దీపావళి వేడుకల వేళ, హార్దిక్ సోదరుడు కృనాల్ పాండ్యా, ఆయన భార్య సంఖూరీ ఏర్పాటు చేసిన వేడుకలకు నటాషా కూడా హాజరైంది. వీరిద్దరికి పెళ్లికి ఇంటి పెద్దలు కూడా అంగీకరించినట్లు తెలుస్తుంది. ఇకపోతే.. వెన్నెముకకు ఆపరేషన్ చేయించుకుని, ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న హార్దిక్, సోషల్ మీడియా తన ప్రేయసి నటాషా స్టాన్ కోవిచ్ గేలిచేలా, ప్రతి ఒక్కరూ ఓట్ చేయాలని కోరాడు. తన సోషల్ మీడియాలో పోస్ట్ పెడుతూ, అభిమానుల ఓట్లు ఇప్పుడు ఆమెకెంతో కీలకమని చెప్పాడు.