ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బిజెపి ఎన్నికల బరిలో రేసుగుర్రం మూవీ విలన్ రవికిషన్‌

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Apr 15, 2019, 10:44 PM

హిందీ, బోజ్‌పురి, తెలుగు చిత్రాల్లో నటించిన హీరో, విలన్ రవి కిషన్ బీజేపీ తీర్థం పుచ్చుకున్న విషయం విదితమే. ఈ లోక్‌సభ ఎన్నికల్లో ఆయన పోటీ చేయబోతున్నారు. బీజేపీ అధిష్టానం తాజాగా విడుదల చేసిన ఏడుగురు అభ్యర్థుల జాబితాలో ‘రేసుగుర్రం’ మూవీ విలన్ రవికిషన్‌ పేరు ప్రకటించింది. ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్ నుంచి రవి కిషన్ బరిలోకి దింపుతున్నట్లు బీజేపీ అధిష్టానం ఓ ప్రకటనలో తెలిపింది.  
2017లో రవి కిషన్ కమలం గూటికి చేరారు. 2014 ఎన్నికల్లో ఆయన.. కాంగ్రెస్ పార్టీ టికెట్‌పై పోటీ చేసి ఓటమిపాలయ్యారు. అయితే ప్రధాని మోదీ చేపట్టిన స్వచ్ఛ భారత్ ప్రచారం రవి కిషన్‌ను ఆకట్టుకోవడంతో.. రెండేళ్ల క్రితం బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరారు. కమల తీర్థం పుచ్చుకున్న రవిని బీజేపీ 2019 ఎన్నికల్లో బరిలోకి దింపుతోంది. అయితే రెండోసారి అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్న ఈ హీరో కమ్ విలన్‌కు ఈ సారైనా విజయం చేకూరుతుందో లేదో వేచి చూడాల్సిందే మరి.  






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com