ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్లేఆఫ్ పోరులో సన్ రైజర్స్ హైదరాబాద్ vs లక్నో సూపర్ జెయింట్స్ మ్యాచ్

sports |  Suryaa Desk  | Published : Wed, May 08, 2024, 11:53 AM

2024 ఐపీఎల్ లో భాగంగా నేడు హైదరాబాద్ vs లక్నో సూపర్ జెయింట్స్ తలపడబోతున్నాయి. ఈ మ్యాచ్ హైదరాబాద్ లో ఇందిరాగాంధీ ఇంటర్ నేషనల్ స్టేడియం లో రాత్రి 7.30కి జరగనుంది. ఈ రెండు జట్ల మధ్య పోరు ఏంటో రసవత్తరంగా జరగనుంది. ఎందుకంటే ఈ  రెండు జట్లు కూడా ప్లే ఆఫ్ కి చేరాలంటే ఇక్కడ గెలవడం చాలా కీలకంగా మారింది. ఎందుకంటే సన్ రైజర్స్, లక్నో రెండు జట్లు కూడా చెరో 12 పాయింట్లతో సమఉజ్జీగా ఉన్నాయి. అయితే రన్ రేట్ ప్రకారం హైదరాబాద్ కాస్త ముందడుగులో ఉంది. అంటే టాప్ 4 లో ఉంటే, లక్నో మాత్రం 6 వస్థానంలో ఉంది. ఈ మ్యాచ్ లో ఎవరు గెలిస్తే వారు రన్ రేట్ తో సంబంధం లేకుండా ముందడుగు వేయవచ్చునని రెండు జట్లు భావిస్తున్నాయి. ఇప్పటివరకు ఈ రెండు జట్ల మధ్య 3 మ్యాచ్ లు జరిగాయి. మూడింటిలోనూ లక్నో గెలవడం విశేషం. ప్రస్తుత లెక్కల ప్రకారం చూస్తే రెండు సమఉజ్జీల మధ్య పోరులో ఎవరు గెలుస్తారు? ఎవరు ప్లే అవకాశాలను మరింత మెరుగు పరుచుకుంటారో వేచిచూడాల్సిందే.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com