పెనుకొండ మండలం చంద్రగిరిలో శ్రీగిరి శక్తిపీఠంలో వెలసిన మహేశ్వరి దేవికి ఆదివారం లక్ష్మిదేవి అలంకారంలో పూజలు నిర్వహించారు. శ్రీగిరి శక్తి పీఠం వ్యవస్థాపకుడు దేవేంద్ర స్వామి మహేశ్వరి దేవి అమ్మవారిని లక్ష్మీదేవి అలంకరణలో రూ.50వేల కరెన్సీ నోట్లతో అలంకరించారు.
అనంతరం చండీ హోమం, పుష్పాలంకరణ, గణపతి పూజ, కుష్మాండ దేవి, కలశారాధన, మహా మంగళహారతి, తీర్థ ప్రసాదాలు, అన్న ప్రసాదం కార్యక్రమాలు నిర్వహించారు.