ప్రయాణికుల లగేజీ విషయంలో విమానయాన సంస్థల సిబ్బంది చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఈ అనుభవం ఇప్పుడు స్టార్ హాకీ ప్లేయర్ రాణి రాంపాల్‌కు ఎదురైంది.
ఇటీవల ఆమె కెనడా నుంచి ఎయిర్ ఇండియా విమానంలో ఢిల్లీకి వచ్చింది. అయితే తన లగేజీని ధ్వంసం చేయడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది. మీ అద్భుతమైన బహుమతికి ధన్యవాదాలు. మీ సిబ్బంది మా బ్యాగులను ఈ విధంగా చూస్తారా?' అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.