రాష్ట్రంలోని అన్ని హోటల్స్‌లో స్విగ్గీని బాయ్ కాట్ చేస్తున్నామని ప్రకటించారు. స్విగ్గీ, జొమాటో కారణంగా హోటల్స్, రెస్టారెంట్లకు తీవ్ర నష్టం జరుగుతోందన్నారు అసోసియేషన్ ప్రతినిధులు. ఆగష్టు 12, 27, సెప్టెంబర్ 27వ తేదీన ముడు దఫాలుగా స్వీగ్గీ, జుమాటో ప్రతినిధులతో చర్చించామన్నారు. తమ అభ్యంతరాలను జొమాటో కొంతవరకు అంగీకరించిందని చెప్పారు.
స్వీగ్గీ మాత్రం కాలయాపన చేస్తూ వస్తోందన్నారు. అత్యవసరంగా పూర్వ జిల్లాల హోటల్స్ అసోసియేషన్ ప్రతినిధులతో సమావేశం నిర్వహించి.. స్విగ్గీపై బ్యాన్ విధించినట్లు ప్రకటించారు. వివిధ రకాల నిబంధనలతో రెస్టారెంట్లకు చెల్లించాల్సిన మొత్తాలను ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని.. అనివార్య కారణాల వల్ల ఈనెల 14 వ తేదీ నుంచి స్విగ్గీని బాయ్ కాట్ చేస్తున్నామని హోటల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ప్రకటించారు.