ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మోదీని వణికిస్తున్న మరో సర్వే

national |  Suryaa Desk  | Published : Thu, Jan 31, 2019, 09:19 PM

తాము అధికారంలోకి వస్తే ఏడాదికి కోటి ఉద్యోగాలు కల్పిస్తామంటూ ఓ రేంజ్‌లో ఊదరగొట్టారు మోదీ. దేశంలో వృద్ధి బాగానే వుందని చెప్పుకునే ప్రయత్నం చేస్తోంది ఎన్డీఏ సర్కార్. వృద్ధి ఓకే.. అభివృద్ధి మాటేమిటన్నది అసలు ప్రశ్న. తాజాగా నేషనల్ శాంపిల్ సర్వే ఆఫీస్(ఎన్ఎస్ఎస్ఓ)- పిరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే (పీఎల్‌ఎఫ్ఎస్) సంయుక్త అధ్యయనంలో కఠోర వాస్తవాలు బయటపడ్డాయి. దేశంలో నిరుద్యోగిత రేటు 2017-18లో 6.1 శాతంగా నమోదైంది. 45 ఏళ్లలో ఎప్పుడూ లేనంత స్థాయికి ఇది చేరినట్టు తేలింది.
నవంబర్ 2016లో ఎన్డీఏ సర్కారు నోట్ల రద్దు చేసిన తర్వాత నిరుద్యోగ సమస్య పెరిగిందని తెలుస్తోంది. 1972-73 తర్వాత ఈ స్థాయిలో నిరుద్యోగ రేటు పెరగడం ఆందోళన కలిగించే అంశం. గ్రామీణ ప్రాంతాల నిరుద్యోగంతో (5.3 శాతం) పోలిస్తే.. పట్టణ ప్రాంతాల్లో (7.8 శాతం) బాగా ఎక్కువ. 2004-05 నుంచి 2011-12 సంవత్సరాల మధ్య గ్రామీణ ప్రాంత మహిళల్లో నిరుద్యోగ శాతం 9.7 నుంచి 15.2 మధ్య వుంటే అది, 2017-18లో 17.3 శాతానికి చేరింది. ఇటీవలే కేంద్రం వైఖరిని దుయ్యబడుతూ జాతీయ గణంకాల కమిషన్ నుంచి ఇద్దరు సభ్యులు తప్పుకున్న నేపథ్యంలో ఈ రిపోర్టు మోదీ సర్కార్ ని మరింత ఇరకాటంలో పెట్టేసింది.


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com