ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రేపు అల్లూరి జిల్లాకి నూతన కలెక్టర్‌ నియామకం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Jun 25, 2024, 11:45 PM

 అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్‌గా ప్రభుత్వం నియమించిన ఏఎస్‌.దినేశ్‌కుమార్‌ బుధవారం బాధ్యతలను స్వీకరించనున్నారు. ప్రస్తుతం ప్రకాశం జిల్లా కలెక్టర్‌గా ఉన్న ఆయన బుధవారం ఇక్కడికి వచ్చి ప్రస్తుత జిల్లా కలెక్టర్‌ ఎం.విజయసునీత నుంచి బాధ్యతలు స్వీకరిస్తారు. అలాగే ఇక్కడ కలెక్టర్‌గా పనిచేసి బదిలీపై వెళుతున్న విజయసునీతకు అదేరోజు కలెక్టరేట్‌లో ఘనంగా వీడ్కోలు పలికేందుకు అధికారులు, సిబ్బంది ఏర్పాట్లు చేస్తున్నారు. మహిళా కలెక్టర్‌గా ఆమె తక్కువ సమయంలోనే జిల్లాపై పట్టు సాధించి, అందరి మన్ననలు పొందారు. అలాగే కొత్త కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరిస్తున్న దినేశ్‌కుమార్‌ గతంలో రంపచోడవరం ఐటీడీఏ పీవోగా పనిచేయడంతోపాటు పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, నిర్వాసితులకు సంబంధించిన అంశాలపై సంపూర్ణ అవగాహన ఉంది. ఆయనకు గిరిజనుల అభివృద్ధి, సంక్షేమానికి చక్కని సేవలు అందిస్తారని జిల్లా వాసులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com