ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అదీప్‌రాజ్‌ కి అస్వస్థత, ఇబ్బంది లేదని కార్యకర్తలకి సందేశం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Jun 25, 2024, 11:44 PM

పెందుర్తి మాజీ శాసనసభ్యుడు అన్నంరెడ్డి అదీప్‌రాజ్‌ ఆస్పత్రి పాలవ్వడం నియోజకవర్గంలో కలకలం రేపింది. ఆయన ఆత్మహత్యకు పాల్పడ్డారని సోషల్‌ మీడియాలో వార్తలు హల్‌చల్‌ చేయడంతో పెందుర్తి ఉలిక్కిపడింది. అయితే ఆ ప్రచారాన్ని ఆయన ఖండించారు. ఆదివారం రాంపురంలోని ఆయన స్వగృహంలో నియోజకవర్గ స్థాయి పార్టీ క్రియాశీలక కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. అందరికీ వెన్నుదన్నుగా నిలుస్తానని భరోసా ఇచ్చారు. ఈ క్రమంలో తెల్లవారేసరికల్లా ఆయన ఆస్పత్రిలో ఉన్నారని వార్తలు రావడం చర్చనీయాంశమైంది. ఈ విషయమై రకరకాల కథనాలు ప్రచారం జరగడంతో సోమవారం సాయంత్రం ఆయన వీడియో విడుదల చేశారు. సోమవారం తెల్లవారుజామున మూడు గంటలు సమయంలో గ్యాస్ట్రిక్‌ పెయిన్‌ రావడంతో కుటుంబసభ్యులు నగరంలోని ఆస్పత్రిలో చేర్పించారని, ప్రస్తుతం తాను డిశ్చార్జి అయ్యి ఆరోగ్యంగానే ఉన్నానని పేర్కొన్నారు. ఆత్మహత్యకు పాల్పడ్డాడని విష ప్రచారం చేశారని అవన్నీ అవాస్తవాలన్నీ కొట్టిపారేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com