ప్రీమియర్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ పోర్స్చేకు సంబంధించిన డీలర్ షిప్ పెద్ద తప్పిదం చేసింది. చైనాలోని యిన్చువాన్ డీలర్షిప్ $148,000 (రూ.1.2 కోట్లు) విలువ చేసే స్పోర్ట్స్ కారును కేవలం $18,000 (రూ.14.85 లక్షలు) కి అమ్ముతున్నట్లు తప్పుగా ప్రచారం చేసింది. 2023 Panamera మోడల్ ను 124,000 యువాన్ ($18,000) కే సేల్ చేస్తున్నట్లు ఆన్లైన్ లో ప్రకటన ఇచ్చింది. దీంతో వందలాది మంది వినియోగదారులు కారు కొనడానికి ఆసక్తి చూపారు. కానీ తాము తప్పుడు సమాచారాన్ని అప్లోడ్ చేసినట్లు పోర్స్చే అంగీకరించింది.