కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ ఎదుట గురువారం బిజెపి నాయకులు రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ ఫోర్ లీడర్ మోటూరి శ్రీకాంత్, పట్టణ అధ్యక్షుడు ఆకుల భారత్ మాట్లాడుతూ.
అమెరికా పర్యటనలో ఉన్న రాహుల్ గాంధీ మతిభ్రమించి మాట్లాడుతున్నారని, విదేశాలలో దేశ గొప్పతనాన్ని వర్ణించాల్సింది పోయి భారత ప్రజాస్వామ్యం గురించి అనుచిత వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటు అన్నారు.