కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఓ ఇంట్లో వ్యభిచారం నిర్వహిస్తున్న నిర్వాహకురాలిని దేవునిపల్లి ఎస్ఐ రాజు ఆధ్వర్యంలో పోలీసులు అరెస్ట్ చేశారు. మొదట ఐదుగురు మహిళలను అదుపులోకి తీసుకొని విచారించారు. అనంతరం నిర్వాహకురాలితో పాటు మరో ఇద్దరిని పట్టుకున్నారు. ఐదుగురిని సఖి కేంద్రానికి తరలించినట్లు ఎస్ఐ తెలిపారు. మిగతా ముగ్గురిని విచారిస్తున్నట్లు వెల్లడించారు.