రైతులకు సంబంధించిన రెండో విడత రైతు రుణమాఫీ మంగళవారం జరుగుతుందని గాంధారి మండలం కాంగ్రెస్ టౌన్ అధ్యక్షులు సంగని బాబా ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 19వ తేదీన మొదటి విడతలో రైతులకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం రూ. లక్ష వరకు రుణమాఫీ చేయగా, నేడు లక్షన్నర వరకు సంబంధించిన రైతుల రుణమాఫీ జరుగుతుందన్నారు. వచ్చే నెల 15వ తేదీ లేదా నెలఖరు వరకు రూ. రెండు లక్షల వరకు రుణమాఫీ జరుగుతుందన్నారు.