రంగారెడ్డి జిల్లా శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో అధికారులు భారీగా డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. మాలావి నుంచి దోహ మీదుగా హైదరాబాద్ చేరుకున్న మహిళా ప్రయాణికురాలి సూట్ కేసులో హెరాయిన్ పెట్టుకొని వచ్చిన మహిళ పై అనుమానంతో అధికారులు తనిఖీలు చేయగా మహిళా ప్రయాణికురాలి నుంచి 41 కోట్లు విలువ చేసే 5. 9 కిలోల హెరైయిన్ డీఆర్ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ప్రయాణికురాలిని అధికారులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.