తెలంగాణ పాలిటెక్నిక్ కాలేజీల్లో లెక్చరర్లు, సాంకేతిక, ఇంటర్మీడియట్ విద్యలో ఫిజికల్ డైరెక్టర్ పోస్టుల భర్తీకి మే నెలలో నిర్వహించనున్న రాతపరీక్షల తేదీలను TSPSC రీషెడ్యూల్ చేసింది. ఈ పరీక్షలను సెప్టెంబరు 4, 5, 6, 8, 11 తేదీల్లో ఆన్లైన్ విధానంలో నిర్వహించనున్నట్లు వెల్లడించింది. పాలిటెక్నిక్ కాలేజీల్లో 247 లెక్చరర్ పోస్టులు, సాంకేతిక, ఇంటర్ విద్యలో 128 పీడీ పోస్టులను భర్తీ చేయనున్నారు.