ట్రెండింగ్
Epaper    English    தமிழ்

షాలిని టీజర్‌, లోగో లాంచ్‌

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sun, Mar 12, 2017, 01:11 AM

స్వర్ణ ప్రొడక్షన్‌‌స బ్యానర్‌ పై లయన్‌సాయి వెంకట్‌ సమర్పణలో వస్తున్న మరో హరర్‌ థ్రిల్లర్‌ షాలిని. ఈ సినిమాకి సంబంధించి లోగోను ప్రముఖ నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ లాంచ్‌ చేయగా టీజర్‌‌సను సెన్సార్‌ బోర్డు సభ్యుడు రామకృష్ణ, నాగబాలసురేష్‌ కుమార్లు రిలీజ్‌ చేశారు. సినిమా పోస్టర్‌ను లయన్‌సాయి వెంకట్‌ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా లయన్‌సాయి వెంకట్‌ మాట్లా డుతూ... త్వరలో రానున్న మా పిశాచి-2 సినిమా పబ్లిసిటీలో బిజీగా ఉండగా ఈ సినిమా దర్శకుడు షెరాజ్‌ నన్ను కలిసి మా షాలిని సినిమా కూడా మీ సహకారం కావాలని అడిగాడు. సినిమా చూసి షెరాజ్‌ చాలా బాగా తీసాడనిపించింది. టీజర్‌ చూస్తుంటేనే సినిమా ఎలా ఉండబో తోందో తీసాడనిపించింది. టీజర్‌ చూస్తుంటేనే సినిమా ఎలా ఉండబో తోందో అర్థమవుతోంది. ఇదో మంచి హారర్‌ థ్రిల్లర్‌ మూవీ. ఈ సినిమా రిలీజ్‌ తరువాత షెరాజ్‌తో కరెప్షన్‌ మీద భారీ బడ్జెట్‌ సినిమా తీయబోతున్నాను అన్నారు. తుమ్మలపల్లి రామసత్యనారాయణ మాట్లాడుతూ హారర్‌ సినిమాలను ఆదరిస్తున్న ఈ రోజుల్లో షాలిని కూడా మంచి హిట్‌ సాధిస్తుంది. చిన్న సినిమాగా వస్తున్న ఈ థ్రిల్లర్‌ మూవీ తప్పకుండా మంచి విజయం సాధిస్తుంది అన్నారు.


చిత్ర నిర్మాత పి.వి. సత్యనారాయణ మాట్లాడుతూ నాకు కృష్ణగారంటే చాలా అభిమానం. ఆయన స్ఫూర్తితోనే నిర్మాతగా మారాను. మాకు అన్ని విధాలా సహకరిస్తున్న సాయి వెంకట్‌గారికి కృతజ్ఞతలు అన్నారు.


దర్శకుడు షెరాజ్‌ మాట్లాడుతూ దెయ్యానికి ఒక రూపం ఉండదని చెప్పే చిత్రమే మా షాలిని. చిన్న సినిమాలకు పడే కష్టం పెద్ద సినిమాలకు ఉండదు. కష్టపడి సినిమాను తీశాం. తప్పకుండా మమ్మల్ని ఆదరిస్తారని ఆశిస్తున్నాం అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో హీరో అమోఘ దేశపతి, హీరోయిన్‌ అర్చన, లిరిక్‌ రైటర్‌ భాష్యశ్రీ, సంగీత దర్శకుడు నవనీత్‌చర్య, జె.వి. మోహన్‌గౌడ్‌, పున్నం సత్యనారాయణ, అనిల్‌సింగ్‌, మురళికృష్ణ, కెమెరామెన్‌ సుమన్‌ శ్రీరామోజు తదితరులు పాల్గొన్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com